మంటల్లో నుంచి దూసుకొచ్చి.. జనం పైకి (వీడియో)

మకర సంక్రాంతి వేళ కర్ణాటకలోని మాండ్యలో ప్రమాదం జరిగింది. హోసహళ్లిలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సంప్రదాయం ప్రకారం హోసహళ్లిలో సంక్రాంతి రోజు సాయంత్రం మంటల్లో నుంచి ఎద్దులు, ఆవులను వదులుతారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఎద్దులు ఆ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో పలువురిని ఎద్దులు ఢీకొట్టాయి. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్