అనుకోని ప్రమాదం జరిగి మరణించినా లేదా అంగ వైకల్యం పొందినా వారి కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. అలాంటి సందర్బంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రప్రభుత్వం PMSBY తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ప్రకారం ఏడాదికి రూ.20 చెల్లిస్తే.. రూ.2 లక్షల బీమా కవరేజీ పొందొచ్చు. 18-70 ఏళ్ల వయసున్న వారు ఈ బీమా పథకంలో చేరొచ్చు. మీరు సెలక్ట్ చేసుకున్న బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం ఆటోమెటిక్‌గా డిడక్ట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.