ఇవాళే పారిస్ ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. ఓపెనింగ్ సెర్మనీ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే అకస్మాత్తుగా ఇవాళ ఫ్రెంచ్ రైల్వే కంపెనీపై అటాక్ జరిగింది. రైల్వే కంపెనీ ఎస్ఎన్‌సీఎఫ్‌కు చెందిన నెట్వర్క్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. పలు చోట్లు రైల్వే లైన్లను ధ్వంసం చేశారు. మరికొన్ని గంటల్లో పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ అటాక్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు.