తొక్కిసలాట ఘటనపై సీఎంకు నివేదిక

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. ‘డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తర్వాత డీఎస్పీ సరిగా స్పందించలేదు. ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేశారు’ అని నివేదికలో పేర్కొన్నారు. అంబులెన్స్ డ్రైవర్ టికెట్ కౌంటర్ వద్ద వాహనాన్ని పార్క్ చేసి వెళ్లారని, ఘటన జరిగిన తర్వాత 20 నిమిషాల వరకు అతడు రాలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్