కరీంనగర్ మునిసిపల్ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి- హరిశంకర్ పెళ్లి రోజును పురస్కరించుకుని పట్టణంలోని 18వ డివిజన్ లో వృద్ధుల, వికలాంగుల చికిత్స సేవ కేంద్రం లో బోయిని కార్తిక్ మరియు అస్తపురం వంశీకృష్ణ ఆధ్వర్యంలో వృద్దులకు, బోజనాలను, పండ్లు, పాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ మేయర్ ప్రజా సేవకు అంకితంమై ప్రజలకు ఎన్నో రకాల సేవలు చేస్తూ, పట్టణమును అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అస్తపురం ఆంజనేయులు, తిరుపతి, పవన్, వినేశ్, చరణ్, శివ, దైవల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు