పేదలకు ఆపద సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు తెలిపారు. ఓదెల మండలం గుంపులకి చెందిన మొగిలి అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నాడు. ఆపరేషన్ తప్పనిసరని వైద్యులు తెలపగా ఆరోగ్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా రూ. 1. 25లక్షల విలువ గల ఎల్ఓసీ చెక్కును మంగళవారం ఎమ్మెల్యే మొగిలికి అందజేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.