బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు: రామగుండం సీపీ

రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 1 నుండి జనవరి 1 వరకు కొనసాగుతాయని తెలిపారు. అలాగే డీజే, డ్రోన్ లపై కూడా నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నట్లు మంగళవారం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్