పారిస్ 2024 ఒలింపిక్స్ పతకాలలోని ఇనుము 20వ శతాబ్దంలో ఈఫిల్ టవర్‌కు చేసిన అనేక పునరుద్ధరణలు, నిర్వహణ సమయంలో సేకిరంచి పొందుపర్చింది. అంటే ఫ్రాన్స్ ల్యాండ్ మార్క్ అయిన అత్యంత ఐకానిక్ కట్టడ గొప్పతనాన్ని కూడా ఆటగాళ్లు మెడలో ధరించనున్నారన్నమాట. ఈ సృజనాత్మక ఆలోచన వల్ల అథ్లెట్ల విజయంలో పారిస్ వారసత్వమూ భాగం కానుంది.