జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగాలంటే ఏం తినాలి అని చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది. ప్రతి రోజూ ఉదయాన్నే వాల్ నట్స్ తింటే మెదడుకు ఎంతో ఉపయోగమని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. వయసుతో పాటూ వచ్చే మతిమరుపు బారిన పడకుండా వాల్‌నట్స్ రక్షిస్తాయి. మూడ్‌ను మెరుగుపరిచి డిప్రెషన్ వంటి సమస్యలను దరిచేరనీయవు. రాత్రంతా నీళ్లల్లో నానబెట్టిన వాటిని ఉదయాన్నే, లేక సాయంత్రం వేళ తిన్నా మంచి ఫలితాలే వస్తాయట.