పారిస్ ఒలింపిక్స్-2024లో కాంస్య పతకం సాధించి స్వదేశానికొచ్చిన భారత హాకీ జట్టుకు శనివారం ఘన స్వాగతం లభించింది. ఇక ఆ తర్వాత హాకీ ప్లేయర్లు న్యూఢిల్లీలోని నేషనల్ స్టేడియానికి వెళ్లారు. స్టేడియం వద్దనున్న మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి వారు నివాళులు అర్పించారు. ఈ వీడియోను హాకీ ఇండియా సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. కాంస్య పతకం కోసం స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో గెలిచింది.