అమ్మిన వస్తువును తిరిగి తీసుకోబోమని దుకాణదారుడు ఎందుకు చెప్పకూడదు?

ఏదైనా వస్తువును కొన్నప్పుడు ఎలాగైతే ఉందో అదే స్థితిలో దానిని కస్టమర్ తిరిగి ఇచ్చేస్తే తీసుకోవడానికి దుకాణదారుడు నిరాకరించకూడదని భారత్ లోని వినియోగదారుల రక్షణ చట్టం చెబుతోంది. ‘అమ్మిన వస్తువులను తిరిగి తీసుకోము (నో రిటర్న్)' అని బిల్లుపై రాయడాన్ని కూడా 1999లో వినియోగదారుల వ్యవహారాల శాఖ నిషేధించింది. వస్తువులను తిరిగి తీసుకోకపోతే వ్యాపారిపై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. నేరం రుజువైతే జరిమానా విధించే నిబంధన కూడా ఉంది.

సంబంధిత పోస్ట్