AP: మాజీ సీఎం జగన్‌పై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌పై 11 కేసులు ఉన్నాయని, అందుకే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని తెలిపారు. ఆయన మీద కేసులు ఎక్కువగా ఉంటే, ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవేమోనని ఎద్దేవా చేశారు. వైసీపీని ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. డబ్బుల కోసం కొందరు కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారని ఆయన చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలన్నారు.