తమిళనాడు కట్టూరులోని ఓ రెస్టారెంట్‌లో తిన్న ఫుడ్‌కు బిల్ కట్టకుండా తప్పించుకునేందుకు పెద్ద ప్లానే వేశాడు. బిర్యానీ ఆర్డర్ చేసి తిని, డబ్బులు చెల్లిలంచకుండా తప్పించుకునేందుకు బిర్యానీలో బొద్దింక వచ్చిందంటూ రచ్చ చేశాడు. సిబ్బందితో గొడవపడి బిల్ కట్టకుండా వెళ్లిపోయాడు. అనంతరం సీసీ టీవీ వీడియో పరిశీలించిన యాజమాన్యం అసలు విషయం కనిపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.