అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ నేత వేలుపూరి ముత్యాలరావు డిసెంబర్ 31న రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. కొంతమంది మహిళలతో అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ పార్టీలో మరి కొంతమంది నాయకులు కూడా పాల్గొన్నట్లు టాక్. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ముత్యాలరావుతో పాటు మరో నలుగురిపై మండపేట పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.