స్టార్ క్రికెటర్ అశ్విన్ భవిష్యత్తులో బీసీసీఐ లేదా ఐసీసీలో కీలక పదవులు చేపట్టేందుకు అర్హత ఉన్న వ్యక్తి అని పాక్ మాజీ ప్లేయర్ రషీద్ లతీఫ్ పేర్కొన్నాడు. ‘‘భారత్‌లో చాలా మంది క్రికెటర్లు ఉన్నా.. అశ్విన్ స్థాయి ప్రత్యేకమైంది. అతడిలో భిన్నమైన క్వాలిటీలున్నాయి. భవిష్యత్తులో అశ్విన్ బీసీసీఐ లేదా ఐసీసీలో కీలక పదవిలో ఉంటాడని నమ్ముతున్నాను. నావైపు, పాకిస్థాన్ నుంచి అతడికి బెస్ట్ విషెస్’’ అని పేర్కొన్నాడు.