AP: మన్యం జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థింసా నృత్యం చేశారు. స్థానిక మహిళలతో కలిసి ఆయన కాలు కదిపారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఆయన నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాగుజోలులో పర్యటించిన ఆయన.. రూ.9 కోట్ల విలువైన రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.