AP: వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలో శనివారం వైసీపీ నుంచి జనసేనలోకిఒకేసారి 150 మంది కార్యకర్తలు చేరారు. చిన్న మదీన, పెద్ద మదీన గ్రామాల నుంచి 150 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ ఇంచార్జ్ PVSN రాజు సమక్షంలో చేరారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వారిని పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.