కుప్పకూలిన ఇల్లు.. శిథిలాల్లో చిక్కుకున్న స్థానికులు (వీడియో)

60చూసినవారు
యూపీలోని ఎటాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ పాత ఇంటిని కూల్చి వేసేందుకు యజమానులు యత్నించారు. ఆ సమయంలో ఇంటి గోడ వెనుక వైపు అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ సమయంలో ఇరుకు సందులో కొందరు రాకపోకలు సాగిస్తున్నారు. ఒక్కసారిగా గోడ కుప్పకూలడంతో కొందరు శిథిలాల్లో చిక్కుకుపోయారు. అదృష్టవశాత్తూ వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్