కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా కెమ్మారా వద్ద శనివారం ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. రోడ్డు పక్కన ఉన్న రెస్ట్‌స్టాప్ సమీపంలో కారు పల్టీలు కొట్టింది. ఆ సమయంలో బస్టాండ్ వద్ద ప్రయాణికులు ఎవరూ లేరు. దీంతో ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. కారు డ్రైవర్‌ను పైకి లేపి, ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.