ముంబైలో ఓ నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. డోంగ్రీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.