పవన్ కళ్యాణ్ పర్యటనలకు ప్రత్యేక హెలికాప్టర్?

85చూసినవారు
పవన్ కళ్యాణ్ పర్యటనలకు ప్రత్యేక హెలికాప్టర్?
ఏపీలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీల నేతలు విస్తృత పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ సారి ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. తన పర్యటనల కోసం ప్రత్యేక హెలికాప్టర్ వాడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి జిల్లాకు కనీసం మూడు సార్లు వెళ్లేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారట. మొదటి దశ పర్యటనలో జిల్లా ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్