రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్‌కు ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం చేశారు. ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరిట సాదియకు లోకేశ్ రూ.3లక్షల సాయం అందించారు. టీడీపీ నేతలు ఈ చెక్‌ను అందించారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు సాదియా కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. సాదియా గతంలో ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం సాధించింది.