అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ప్రమాదంలో 18 మంది మృతి చెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న అధికారులు ఎసెన్షియా ఫార్మా కంపెనీని మూసివేశారు. అయితే ప్రమాద సమయంలో కంపెనీలో 300 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు తెలిపింది. పేలుడు ధాటికి పరిశ్రమ భవనం దెబ్బతిని బలహీనంగా మారింది. ఈ నేపథ్యంలో కంపెనీని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.