పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో పెరుగు తింటే జలుబు, గొంతు నొప్పి, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అజీర్తి, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను, కండర ద్రవ్యరాశిని పెంచుతాయి.