నిన్న ICAI వారు ప్రకటించినటువంటి సీఏ ఇంటర్ మరియు సీఏ ఫైనల్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా 14 వ ర్యాంకు, ఆల్ ఇండియా 37 వ ర్యాంకు మరియు ఆల్ ఇండియా 38 వ ర్యాంకు సాధించారని, మాస్టర్ మైండ్స్ అడ్మిన అడ్వైజర్ సీఏ మోహన్ తెలిపారు. ఈ ర్యాంకులతో పాటుగా సి.ఏ ఇంటర్ మరియు సి.ఏ ఫైనల్ లో గ్రూప్-1 లేదా గ్రూప్-2 లేదా రెండు గ్రూపులు పాస్ అయిన విద్యార్థులు సుమారుగా 2000 మంది వరకు ఉంటారన్నారు. ఇంతటి మంచి ఫలితాలను సాధించి మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థకు మంచి పేరు తెచ్చి పెట్టినటువంటి విద్యార్థులందరికీ, సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకి మరియు మాస్టర్ మైండ్స్ టీమ్ మెంబర్స్ కి ఆయన ధన్యవాదాలు తెలియజేసారు. అదేవిధంగా కె.తేజశ్విని (HT No.205900), సి.ఏ ఫైనల్ జులై 2024 ఫలితాలలో ఆల్ ఇండియా 14 వ ర్యాంకు సాధించిందని, వై.వర్షిత రెడ్డి (HT No. 205984), సి.ఏ ఫైనల్ జులై 2024 ఫలితాలలో ఆల్ ఇండియా 37 వ ర్యాంకు సాధించిందని, ఎం.వి.ఎల్.నారాయణ (HT No. 305254) సిఏ ఇంటర్ జులై 2024 ఫలితాలలో ఆల్ ఇండియా 38 వ ర్యాంకు సాధించారని తెలిపారు.