ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపింది. ఎన్నికల ఫలితాలపై తాము చేసిన వ్యాఖ్యలకు బాధ పడుతున్నట్లు పేర్కొంది. భారత్ లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియపై మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భారత్ సహా అనేక దేశాల్లో ప్రజలు తమ ఓటుతో అధికార ప్రభుత్వాలను మార్చేశారని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.