అనంతగిరి మండలంలోని ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం.. మండలంలోని పినకోట పంచాయతీలోని చటకంబలో తారురోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేవరపల్లి నుండి సిమెంట్ లోడేసుకొని వెళ్తున్న లారీ జీనబాడు పంచాయతీలోని కొరపర్తి ఘాట్ రోడ్డు ఎక్కలేక అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది.