అనంతగిరిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

64చూసినవారు
అనంతగిరిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
అనంతగిరి మండలంలో బుధవారం వ్యవసాయ అధికారిణి ఉమా మహేశ్వరీ ఆధ్వర్యంలో అనంతగిరి, లక్ష్మీపురం, గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ శెట్టి నీలవేణి, జడ్పీటీసీ గంగరాజు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విత్తనాలను సకాలంలో అందించాలని, నాణ్యతమైన విత్తనాలు రైతులకు సరఫరా చేయాలనీ ఆదేశించారు. పంట రుణాలపై రైతులకు అవగాహన కల్పించారు. పంట పొలాల్లో పలు సూచనలు అందించారు.