వ్యక్తి ఎదుగుదలకు స్వీయ శిక్షణ ఎంతో అవసరమని ఖరగపూర్ ఐఐటి ప్రొఫెసర్ ఆచార్య జిపి రాజశేఖర్ తెలిపారు. సోమవారం చోడవరం ఉషోదయ విద్యాసంస్థల ప్రాంగణంలో జే రమణాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు విషయాలపై విద్యార్థులకు సూచనలు చేశారు.