చోడవరం (గోవాడ) చక్కెర కర్మాగారంపై కూటమి నాయకులు మొసలి కన్నీరు కార్చ కుండా రైతులకు మద్దతు ధర ఇచ్చి ఫ్యాక్టరీ ఆధునికరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న డిమాండ్ చేశారు. శుక్రవారం అయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం నిరాహార దీక్షలు పాదయాత్రలు చేసి మహజన సభ దగ్గర పడడంతో వినతి పత్రాలు ఇచ్చి రైతులను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.