విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఛాంబర్ కు ఎవరూ రాకుండా గతంలో వీసీ ప్రసాద రెడ్డి ఐరన్ గేట్లు నిర్మించిన విషయం తెలిసిందే. ఇన్‌చార్జి వీసీగా శశిభూషన్ గురువారం బాధ్యతలు స్వీకరించగా. శుక్రవరాం వీసీ చాంబర్ వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ గేట్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది వాటిని తొలగించారు. దీంతో అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.