రిలయన్స్ ఫౌండేషన్ మరియు పశుసంవర్ధక శాఖ వారి ఆధ్యర్యంలో మునగపాక మండలం ఒంపోలు గ్రామంలో గురువారం పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మజ మాట్లాడుతూ వేసవి మరియు తొలకరిలో పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. హైబ్రిడ్ గడ్డి జాతులు అయిన సూపర్ నేపియర్ మరియు రెడ్ నేపియర్ వంటి గడ్డిని పెంచుకోవడం వలన పశువులు మేపు ఖర్చులను తగ్గించుకోవచ్చు అని చెప్పారు.