నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు టౌన్ ఎస్ఐ రమేశ్ తెలిపారు. స్థానిక పాత బస్టాండ్ ప్రాంతంలో పేకాటాడుతున్నారన్న సమాచారం మేరకు సోమవారం నిర్వహించిన దాడులలో ఐదుగురు పేకాటరాయుళ్లు దొరికారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 4, 300 రూపాయల నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అసాంఘిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.