నర్సీపట్నంలో మకరజ్యోతి మహోత్సవాల్లో భాగంగా అయ్యప్ప స్వామి రథయాత్ర ఊరేగింపు కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ రథయాత్ర ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఊరేగింపులో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వీటిలో మహిళలు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది.