నర్సీపట్నం: రాజేష్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో చోరీ

83చూసినవారు
నర్సీపట్నంలో రాజేష్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడి సుమారు రూ. 25 వేలు చోరీ చేశారు. శనివారం దొంగతనం జరిగిందని గుర్తించారు. లోపలకి వెళ్లి చూడగా క్యాష్ కౌంటర్ లో నగదు మాయం అయినట్లు నిర్వాహకులు తెలిపారు. రెస్టారెంట్ వెనుక గేట్ నుంచి లోపలకి దొంగలు ప్రవేశించినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు నర్సీపట్నం సిఐ గోవిందరావు, ఎస్సై రమేష్ శనివారం ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్