ఆస్ట్రేలియన్ కాన్సులేట్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ మిస్టర్ డేవిడ్ ఎగుల్స్టన్, ఆస్ట్రేలియన్ హై కమీషన్ ఫస్ట్ సెక్రటరీ మిస్ గ్రేస్ విలియమ్స్ విశాఖ పోర్టును శుక్రవారం సందర్శించారు. పోర్టు డిప్యూటీ చైర్మన్ దుర్గేశ్ కుమార్ దూబే, ఆస్ట్రేలియన్ బృందానికి స్వాగతం పలికారు. పోర్టులో ఉన్న సౌకర్యాలు, పోర్టు అభివృద్ధికి చేపడుతున్న వ్యూహాత్మక కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ చైర్ పర్సన్ వివరించారు.