విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) లో విజిలెన్స్ అవగాహనా వారోత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. పోర్ట్ చీఫ్ విజిలెన్స్ అధికారి పి. ఎస్. ఎల్. స్వామి, ఐఓఎఫ్ఎస్, పోర్ట్ విభాగాధిపతులు, అధికారులు సిబ్బంది సమక్షంలో పరిపాలనా భవనంలో ఇంటిగ్రిటీ ప్రతిజ్ఞను చదివించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ప్రధానమంత్రి సందేశాలు ఉన్నతాధికారులు చదివి వినిపించారు. పోర్ట్ సిబ్బంది సీహార్స్ జంక్షన్ వరకూ ర్యాలీని నిర్వహించారు.