రాష్ట్ర స్థాయి పోటీలకు పాడేరు విద్యార్థులు

60చూసినవారు
విజయవాడలో ఈనెల 24న జరుగనున్న రాష్ట్రస్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలకు పాడేరు విద్యార్థులు ఎంపికైనట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి, అల్లూరి జిల్లా ఏడీ గిడ్డి అప్పలనాయుడు ఆదివారం తెలిపారు. జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా పాడేరు హైస్కూల్లో జిల్లా స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో ప్రధమ స్థానంలో నిలచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్