మండల కేంద్రమైన కోటవురట్ల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి సరోజిని అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎంపీడీవో కాశీ విశ్వనాధరావు మాట్లాడుతూ. ప్రజలు అడిగిన సమాచారాన్ని అధికారులు 30 రోజుల్లోగా అందించాలన్నారు. ఈ సదస్సులో ఈఓపీఆర్డీ రఘురాం, హౌసింగ్ ఏఈ వరప్రసాద్, ఉపాధి హామీ పథకం ఏపీఓ నాగరాజు పాల్గొన్నారు.