పరవాడ గ్రామానికి చెందిన బండారు నీలబాబు ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి స్నేహితులు ముందుకు వచ్చారు. 2001-2002 బ్యాచ్ కు చెందిన నీలబాబు కుటుంబానికి పూర్వ విద్యార్థులు రూ. 50, 000 ఆర్థిక సహాయాన్ని అందించి తమ ఉదారతను చాటుకున్నారు. అలాగే ఫార్మాసిటీకి చెందిన జి సింహాద్రి కుటుంబానికి రూ. 25, 000, మునగపాక మండలం రాజుపేట కు చెందిన కె శ్రీనివాసరావు కుటుంబానికి రూ. 25, 000 అందజేశారు.