కాలుష్యం కోరల్లో చిక్కుకున్న పరవాడ మండలం తాడి గ్రామాన్ని తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. శనివారం పరవాడలో పర్యటించిన చంద్రబాబుతో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఈ ప్రాంతంలో గల పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి కల్పించడం లేదని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.