సబ్బవరం: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

69చూసినవారు
సబ్బవరం: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
సబ్బవరం మండలంలోని తవ్వవానిపాలెం, అమృతపురం, అసకపల్లి, బాట జంగాల పాలెం గ్రామాల్లో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులను సంక్రాంతి లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక వసతి సౌకర్యాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పని చేస్తున్నట్లు తెలిపారు.