డొంకరాయి జలాశయం నుండి నీరు విడుదల

52చూసినవారు
డొంకరాయి జలాశయం నుండి నీరు విడుదల
విడవకుండా కురుస్తున్న వర్షాలకు చింతూరు మండలం డొంకరాయి జలాశయంలో నీటిమట్టం బుధవారం అర్ధరాత్రి 1036 అడుగులకు పెరిగింది. జెన్ కొ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక గేటును రెండు అడుగులు ఎత్తి 2, 173 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని జెన్ కొఈ ఈ విజయ్ కుమార్ తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, ఇన్ఫ్రాస్ తగ్గితే నీటి విడుదల నిలిపివేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్