విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం కాన్వెంట్ జంక్షన్ లో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. లారీ తల పై నుంచి వెళ్లిపోవడంతో తల నుజ్జు నుజ్జు అయ్యింది. మృతుడు జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు జి. అనిల్ కుమార్ (38) డాక్ యార్డ్ పరిసర ప్రాంగణంలో ఉపాధి చేసుకొని స్వగ్రామం పెందుర్తికి వెళ్లే క్రమంలో కాన్వెంట్ జంక్షన్ లో రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొట్టడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందాడని సర్కిల్ ఇన్స్పెక్టర్ దశరధి పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ హాస్పిటల్ కి తరలించారు.