సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన మునగపాక బైపాస్ రోడ్ లో మంగళవారం ఎడ్ల బండ్ల పరుగు పందెం పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలో వివిధ ప్రాంతాలకు చెందిన 13 ఎడ్ల బండ్లు జతతు పాల్గొన్నాయి. పోటీలను తిలకించడానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. విజేతలకు సాయంత్రం నగదు బహుమతులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే మహిళలకు ముగ్గులు పోటీలను కూడా నిర్వహించినట్లు తెలిపారు.