ఎలమంచిలి నియోజకవర్గం సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తీసుకువెళ్లారు. శనివారం పరవాడ మండలం వెన్నెల పాలెంలో పర్యటించిన ముఖ్యమంత్రిని కలిసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బాగా వెనుకబడిన ఎలమంచిలి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు.