పరవాడ ఫార్మాసిటీలో గల ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో విషవ్రాయువులు లీకయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచింది. బుధవారం వెలుగులోకి రావడంతో సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సీఐటీయూ ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.