అనకాపల్లి ఎంపీ సీ.ఎం. రమేష్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అమిత్ షాకు ఆయన వివరించారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి కూడా రమేష్ అమిత్ షాకు వివరంగా తెలిపారు. తనని కలిసేందుకు సమయం కేటయించినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.