అనకాపల్లిలో ఘనంగా నూకాంబిక పండగ

67చూసినవారు
అనకాపల్లి పట్టణం 81వ డివిజన్ పరిధిలో వేంచేసియున్న నూకాంబిక అమ్మవారి పండగను స్థానికులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకొని మేళతాళాలతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత 16 ఏళ్లగా అమ్మవారి పండగను ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్