మైనర్‌ హత్య ఆవేదన కలిగించింది

80చూసినవారు
అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలంలో మైనర్‌ బాలికను అతికిరాతకంగా హత్యచేసిన సంఘటన అవేదన కలిగించిందని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. ఆదివారం ఆమె అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. గంజాయి మత్తులో యువత ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. నిందితుడు ఇటీవల జైలు నుంచి విడుదల అయ్యాడని, గతంలో మైనర్‌ను వేధించినట్టు తెలిసిందన్నారు. నిందితుడికి కఠిన విధించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్